సోమవారం 13 జూలై 2020
National - Jun 28, 2020 , 19:01:48

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ : నిత్యావసరాలకోసం ఎగబడ్డ జనం

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ : నిత్యావసరాలకోసం ఎగబడ్డ జనం

గౌహతి : అస్సాం రాష్ట్రంలోని గౌహతి మెట్రోపాలిటన్‌ నగరంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో 14రోజుల పూర్తి లాక్‌డౌన్‌ అమలుకు నిర్ణయం తీసుకుంది. శనివారం సాయంత్రం 7గంటల నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి రానుంది. దీంతో కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు జనం ఒక్కసారిగా రావడంతో దుకాణాలు, మార్కెట్లు కిటకిటలాడాయి. జనాలు మాస్కులు ధరించినా..భౌతికదూరం నిబంధన పాటించలేదు. గౌహతి నగరంలో మరో 14రోజలపాటు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తామని ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సూచనలు జారీ చేసిందని నగర పోలీస్‌ కమిషనర్‌ ప్రసాద్‌ గుప్తా తెలిపారు. 

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌కు మించిన ప్రత్యామ్నాయం లేదని, జనాలు పెద్ద ఎత్తున ఓ చోట గుమిగూడడం సరికాదని బాప్తిదాస్‌ అనే స్థానికుడొకరు అభిప్రాయపడ్డారు. ప్రజల బాధ్యతారాహిత్యం కారణంగా వైరస్‌ వ్యాపించే అవకాశముందని గంగుల్‌దాస్‌ అనే మరో స్థానికుడు అన్నారు. ఇదిలా ఉండగా అస్సాంలో శనివారం ఒక్కరోజే 246 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 7,165 కేసులు నమోదుకాగా వీటిలో 2,338 యాక్టివ్‌ కేసులున్నాయి. 4,814మంది దవాఖాన నుంచి డిశ్చార్జికాగా 10మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వాస్‌శర్మ తెలిపారు. 


logo