శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 14:15:23

ఐసోలేషన్‌ సెంటర్‌ నిర్మాణాన్ని ప్రారంభించిన అసోం

ఐసోలేషన్‌ సెంటర్‌ నిర్మాణాన్ని ప్రారంభించిన అసోం

గౌహతి : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అసోం ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కోవిడ్‌-19పై పోరాటానికి గాను గౌహతిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్‌ స్టేడియంలో కరోనావైరస్‌ ఐసోలేషన్‌ సెంటర్‌ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ రాష్ట్ర మంత్రి మేమంత బిస్వా శర్మ సెంటర్‌ నిర్మాణ పనులను దగ్గురుండి పర్యవేక్షించారు. అదేవిధంగా అసోం వ్యాప్తంగా నేడు రేడియో ద్వారా రెండు గంటల సుదీర్ఘ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించారు. కోవిడ్‌-19 వ్యాధి భారిన పడకుండా ఏం చేయాలి.. ఏం చేయకూడదని నిపుణులు వివరించారు. కాగా అసోంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు.


logo