గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 02, 2020 , 13:15:35

రేప్ చేసి చెట్టుకు ఉరేశారు.. విద్యార్థుల అరెస్టు

రేప్ చేసి చెట్టుకు ఉరేశారు.. విద్యార్థుల అరెస్టు

హైద‌రాబాద్‌: అస్సాంలో దారుణం జ‌రిగింది. 12 ఏళ్ల బాలిక‌ను అత్యాచారం చేసి.. ఓ చెట్టుకు ఉరి తీశారు.  ఈఘ‌ట‌న‌లో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాస్తున్న ఏడు మంది విద్యార్థుల‌ను అరెస్టు చేశారు.  బిశ్వ‌నాథ్ జిల్లాలోని చ‌క్లా గ్రామంలో ఈ ఘాతుకం జ‌రిగింది.  ఘోపూర్ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. హెచ్ఎస్ఎల్‌సీ ప‌రీక్ష‌లు రాస్తున్న విద్యార్థుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ఓ సీనియ‌ర్ పోలీసు అధికారి చెప్పారు.  ప‌రీక్ష‌లు పూర్తి అయిన నేప‌థ్యంలో.. ఇంట్లో పార్టీ చేసుకుందాం రావాలంటూ ఆ బాలిక‌ను ఆహ్వానించి.. ఆ త‌ర్వాత అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శుక్ర‌వారం రాత్రి రేప్ జ‌రిగింది. ఇంటికి స‌మీపంలో ఉన్న అడ‌విలో ఓ చెట్టుకు ఉరి వేశారు.  ఆదివారం ఆ బాలిక శ‌వం దొరికింది. logo
>>>>>>