గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 19:05:56

అస్సాంలో వరదల బీభత్సం

అస్సాంలో వరదల బీభత్సం

నాగావ్ : అస్సాం రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. నాగావ్‌ జిల్లా రాహా ప్రాంతంలో పాఠశాలలు, నీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాలు వరదనీటిలో మునిగిపోయాయి. బోర్పాని, కపిలి, కలాంగ్ ప్రాంతంలో నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గూర్గావ్, ఆంతల, కమర్గావ్ తదితర గ్రామాలు వరదల్లో కొట్టుకుపోయాయి. తాగునీరు లేక స్థానికులు చేతి పంపులపై ఆధారపడాల్సి వస్తోంది.

‘రాష్ట్రంలో వరదల కారణంగా 50 వేల మంది ప్రభావితమయ్యారు. పంట పొలాలు నీట మునిగిపోయాయి. చాలామంది సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. బాధితులకు ప్రభుత్వం సామగ్రి అందిస్తోంది’ అని స్థానికుడొకరు తెలిపారు. వరద కారణంగా శుక్రవారం ముగ్గురు ప్రాణాలు కోల్పోగా రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 96కు చేరిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో కర్బీలాంగ్పీ జల విద్యుత్ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో వరద కాస్త శాంతించింది. అసోంలో వివిధ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించడం ఈ ఏడాది ఇది నాలుగోసారి.


logo