బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 09:42:08

అస్సాంలో వరదలు : 112కు చేరిన మృతులు

అస్సాంలో వరదలు : 112కు చేరిన మృతులు

గౌహతి : అస్సాంలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. పదిహేను రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలోని 30 జిల్లాల్లో చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. భారీగా పంటలు దెబ్బతిన్నాయి. జల విలయం కారణంగా ఇప్పటి వరకు 112 మంది మృతి చెందారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా 56 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్‌డీఎంఏ) గురువారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.  ధెమాజీ, బక్సా, మొరిగావ్ జిల్లాల్లో వరదలు కారణంగా 14,205 మంది ప్రభావితమయ్యారని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది. వరద కారణంగా వివిధ జిల్లాల్లో 9,200 మందికి పైగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఈ వారం ప్రారంభంలో తెలిపింది.  


logo