ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 09:22:18

అసోంలో భారీ వానలు.. జలదిగ్భందంలో 16 లక్షల మంది

అసోంలో భారీ వానలు.. జలదిగ్భందంలో 16 లక్షల మంది

దిస్పూర్‌: ఈశాన్య రాష్ట్రం అసోంను భారీ వానలు ముచ్చెత్తుతున్నాయి. గత సోమవారం నుంచి కురుస్తున్న వానలతో 22 జిల్లాల్లో 16 లక్షల మంది వరదల్లో చిక్కుకుపోయారని విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది. నిన్న కురిసిన వర్షాలకు ఒకరు మరణించారని, దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 34కు  చేరిందని వెల్లడించింది. మరో నాలుగు రోజులపాటు పిడుగులతోకూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతవరణ శాఖ ప్రకటించింది. 

భారీ వర్షాలలో వరదలు పోటెత్తడంతో రాష్ట్రంలోని ధెమాజి, లఖీంపూర్‌, బిశ్వనాథ్‌, దరాంగ్‌, నల్బరి, బార్పెటా వంటి 22 జిల్లాల్లో 16,03,255 మంది వరదల్లో చిక్కుకుపోయారని తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటు చేసిన 162 పునరావాస కేంద్రాల్లో 12,597 మంది ఉన్నారని పేర్కొంది.


logo