గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 15:43:41

అసోం వరదలు.. 116కు చేరిన జంతువుల మరణాలు

అసోం వరదలు.. 116కు చేరిన జంతువుల మరణాలు

అసోం : అసోంలో గత కొన్ని రోజులుగా వరదలు వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 54 లక్షల మంది వరదలకు ప్రభావితం కాగా 79 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. వరదల కారణంగా ప్రజలతో పాటు మూగజీవాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో వరదల ధాటికి ఇప్పటివరకు 116 జంతువులు మృత్యువాత పడ్డాయి.  ఇందులో 88 జింకలు, 11 ఖడ్గమృగాలు ఉన్నట్లు పార్కు నిర్వాహకులు తెలియజేశారు. 143 జంతువులను రక్షించి సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టామని అసోం ప్రభుత్వం తెలియజేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo