శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 19:20:07

క‌జిరంగాలో 129 జంతువులు మృతి

క‌జిరంగాలో 129 జంతువులు మృతి

గువాహ‌టి: అసోంలో వ‌ర‌ద‌ల ప్ర‌భావం కొంత‌మేర‌కు త‌గ్గినా ఇంకా ప‌లు ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. క‌జిరంగా నేష‌న‌ల్ పార్కులో భారీగా వ‌ర‌ద‌నీరు నిలిచి ఉంది. భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా ఆ పార్కులో ప్ర‌తిరోజు  జంతువుల మ‌ర‌ణాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మ‌ర‌ణించిన మొత్తం జంతువుల సంఖ్య 129కి చేరింది. ఇంకా నీట మునిగిన ప‌లు జంతువుల‌ను అధికారులు ర‌క్షించారు. అధికారులు కాపాడిన జంతువుల్లో 14 ఖడ్గమృగాలు,  ఐదు అడవి బర్రెలు, ఎనిమిది అడవి పందులు,  రెండు చిత్తడి జింకలు, 95 చుక్కల జింకలు, ఒక సాంబార్‌, మూడు ముళ్ల పందులు, ఒక కొండ చిలువ ఉన్నాయ‌ని అసోం ప్ర‌భుత్వం తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo