బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 08:37:02

అసోం కరోనా పేషెంట్లందరూ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే

అసోం కరోనా పేషెంట్లందరూ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే

గువహటి : అసోంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16కు చేరింది. ఇందులో 15 మంది ఢిల్లీలోని మర్కజ్‌ భవనంలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారేనని అసోం వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. అసోంలో సోమవారం వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మంగళవారం రాత్రి తొలి కరోనా కేసు నమోదైంది అసోంలో. కరోనా సోకిన 52 ఏళ్ల వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. కరోనా సోకిన వ్యక్తిని కరీంగంజ్‌కు చెందిన వ్యక్తిగా అధికారులు నిర్ధారించారు. మిగతా 15 మంది గోలాఘాట్‌ జిల్లాకు చెందిన వారు. ఈ 15 మంది మర్కజ్‌ ప్రార్థనలకు హాజరై వచ్చిన వారని అధికారులు తెలిపారు. వీరిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో తబ్లిగీ జమాత్‌ సంస్థ నిర్వహించిన మత కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చిన వారి కోసం రాష్ర్టాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటివరకు 6000 మందిని గుర్తించారు. మరో 2వేల మంది కోసం గాలిస్తున్నారు. ఆయా రాష్ర్టాల్లో కొత్తగా వెలుగుచూసిన పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మంది ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చినవారే ఉంటున్నారు. 300కుపైగా కేసులకు మర్కజ్‌తో లింకులు ఉన్నాయి. వీటిలో ఒక్క తమిళనాడులోనే 190 కేసులున్నాయి. ఆ తర్వాత ఏపీలో 70, ఢిల్లీ 24, తెలంగాణ 21, అసోం 15, అండమాన్‌ 10, పుదుచ్చేరి 2, కశ్మీర్‌లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కరోనా వ్యాప్తికి కేంద్రకంగా మారిన నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ఉన్నవారిని ఎట్టకేలకు ఖాళీచేయించారు. గత 36 గంటల్లో మొత్తం 2,361 మందిని అక్కడి నుంచి తరలించారు. వారిలో 617 మందిని వివిధ దవాఖానలకు తరలించగా, మిగిలినవారిని క్వారంటైన్‌లో ఉంచారు. 


logo