శనివారం 06 జూన్ 2020
National - May 21, 2020 , 18:40:45

కరోనాతో ఏఎస్‌ఐ భీమ్‌సేన్‌ మృతి

కరోనాతో ఏఎస్‌ఐ భీమ్‌సేన్‌ మృతి

ముంబై: ముంబైలో కరోనాతో మరో పోలీస్‌ అధికారి ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్‌ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏఎస్‌ఐ భీమ్‌సేన్‌ హరిబావ్‌ పింగిల్‌ మృతి చెందినట్లు ముంబై పోలీస్‌ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర డీజీపీ సహా అన్ని క్యాడర్లకు చెందిన పోలీసులు భీమ్‌సేన్‌ కుటుంబసభ్యులను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ముంబైలో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న భీమ్‌సేన్‌ హరిబావ్‌ పింగిల్‌ వయస్సు 57 ఏండ్లు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో 55 ఏండ్లకు పైబడి ఉన్నవారిని విధులకు రావొద్దని ప్రభుత్వం సూచించింది.  భీమ్‌సేన్ హరిబావ్‌ నెల రోజులుగా సెలవులో ఉన్నారు. కరోనా లక్షణాలుండటంతో వారం క్రితం సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో చేరారని ముంబై పోలీస్‌ శాఖ అధికార ప్రతినిధి ప్రణయ్‌ అశోక్‌ తెలిపారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo