శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 17, 2021 , 07:53:35

అన్ని పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం

అన్ని పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం

జైపూర్‌ : సీఎం అశోక్‌ గెహ్లాట్‌ నేతృత్వంలోని రాజస్థాన్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ.16.80కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఈ సందర్భంగా సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. పర్యవేక్షణ, సమయానుసారంగా పూర్తి చేసేందుకు జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తొలిదశలో రూ.8.40కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. పీఎస్‌లలో సీసీకెమెరాల ఏర్పాటుకు సంబంధించిన ప్రాజెక్టుకు రూ.16.80కోట్లకుపైగా ఖర్చవుతాయని హోంశాఖ, ఆర్థికశాఖ అంచనా వేశాయి. వీటిని పూర్తి చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీకి ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ హోం నేతృత్వం వహించనున్నారు. ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ ఫైనాన్స్, స్టేట్ ఉమెన్ కమిషన్ చీఫ్, ఐజీ పోలీసులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అదే విధంగా, డివిజనల్ కమిషనర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలో జిల్లా కలెక్టర్‌, సంబంధిత నగర మునిసిపల్ కమిషనర్‌, గ్రామీణ ప్రాంతాల్లో సీపీ లేదంటే ఎస్పీ సభ్యులుగా ఉంటారని సీఎం తెలిపారు.

VIDEOS

logo