ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 14:21:28

వేతనం పెంచాలంటూ ఆశా వర్కర్ల నిరసన

వేతనం పెంచాలంటూ ఆశా వర్కర్ల నిరసన

బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఆశా వర్కర్లు తమ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. శివమొగ్గ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట శుక్రవారం భారీ ఎత్తున నిరసన తెలిపారు. కరోనా నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయక విధులు నిర్వహిస్తున్న తమకు నెలకు రూ.12,000 జీతం చెల్లించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తమ వేతనం పెంచే వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్లు ఈ నెల 10వ తేదీ నుంచి నిరసన తెలుపుతున్నారు. రెండు వారాలుగా ఆందోళన చేస్తునప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై వారు మండిపడుతున్నారు.

logo