శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 03:33:02

పెరిగిపోతున్న మెజారిటీ మతోన్మాదం

పెరిగిపోతున్న మెజారిటీ మతోన్మాదం
  • అసదుద్దీన్‌ ఒవైసీ ఆందోళన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో మెజారిటీ మతోన్మాదం (మెజారిటేరియనిజం) పెరిగిపోతున్నదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘హిందూ రాజ్య’ స్థాపన దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు  ఉన్నాయని చెప్పారు. బుధవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను హిందువులకు వ్యతిరేకం కాదన్నారు. మెజారిటీ మతోన్మాదానికి వ్యతిరేకంగా మాత్రమే ఉద్యమిస్తున్నానని పేర్కొన్నారు. మెజారిటీ మతోన్మాదం దేశాన్ని నాశనం చేస్తుందని, మైనారిటీ మతోన్మాదం ఆ వర్గానికే చేటు తీసుకు వస్తుందని తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ సరిగ్గానే చెప్పారని అన్నారు. కానీ బీజేపీ సర్కార్‌.. రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలదన్ని మెజారిటీ మతోన్మాదం దిశగా చట్టాలను తీసుకొస్తున్నదని విమర్శించారు.


logo