శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 04, 2020 , 14:56:16

ఆ ఏడు రోజులు విమానాలు బంద్‌!

ఆ ఏడు రోజులు విమానాలు బంద్‌!

కోల్‌క‌తా: ప‌శ్చిమబెంగాల్‌లోని కోల్‌క‌తా విమానాశ్ర‌యంలో ఆగ‌స్టు 5 నుంచి 31 మ‌ధ్య ఏడు రోజుల‌పాటు విమానాల రాక‌పోక‌లు నిలిచిపోనున్నాయి. ఆగ‌స్టు 5, 8, 20, 21, 27, 28 & 31 తేదీల్లో విమానాల రాక‌పోక‌లు కొన‌సాగ‌వ‌ని కోల్‌క‌తా  ఎయిర్‌పోర్టు అధికారులు మంగ‌ళ‌వారం వెల్ల‌డించారు. ప‌శ్చిమబెంగాల్ ప్ర‌భుత్వం సోమ‌వారం రాత్రి విడుద‌ల చేసిన ఆదేశాల మేర‌కు తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. 

క‌రోనా క‌ట్ట‌డి కోసం ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం ముందుగా ఆగ‌స్టు 5, 8, 16, 17, 23, 24, 31 తేదీల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు జూలై 30న ఒక‌ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నేప‌థ్యంలో ఆయా తేదీల్లో విమానాల రాక‌పోక‌ల‌ను నిలిపివేయాల‌ని కోల్‌క‌తా ఎయిర్‌పోర్టు అధికారులు నిర్ణ‌యించారు. అయితే లాక్‌డౌన్ తేదీల‌ను మారుస్తూ సోమ‌వారం రాత్రి ప్ర‌భుత్వం మ‌రో ప్ర‌క‌ట‌న చేసింది. దాంతో ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌టించిన తేదీల్లో మాత్ర‌మే విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధం ఉంటుంద‌ని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.    ‌   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo