శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 10:56:15

అవ్వ‌, మ‌నువ‌డిపై ఎద్దు దాడి.. వీడియో

అవ్వ‌, మ‌నువ‌డిపై ఎద్దు దాడి.. వీడియో

ఓ ఎద్దు కోపంతో ర‌గిలిపోయింది. వీధిలోకి వ‌చ్చిన ఆ ఎద్దు బీభ‌త్సం సృష్టిస్తూ అంద‌ర్ని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది. రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలిపై ఎద్దు దాడి చేసింది. దీంతో ఆమె నేల‌పై ప‌డిపోయింది. వృద్ధురాలిని ఎద్దు దాడి నుంచి త‌ప్పించేందుకు ప‌రుగెత్తుకు వ‌చ్చిన ఆమె మ‌నువ‌డిపై కూడా దాడి చేసింది ఎద్దు. ఆ అబ్బాయి కూడా కింద ప‌డిపోయాడు. పిల్లాడు తేరుకుని మ‌ళ్లీ అవ్వ వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డ్నుంచి తీసుకెళ్తుండ‌గా, మ‌రోసారి వారిద్ద‌రిపై ఎద్దు దాడి చేసి గాయ‌ప‌రిచింది. స్థానికులు అప్ర‌మ‌త్త‌మై ఆ ఎద్దును అక్క‌డ్నుంచి వెళ్ల‌గొట్టారు. అయితే ఎద్దు దాడిలో మొత్తం ముగ్గురు గాయ‌ప‌డిన‌ట్లు స్థానికులు తెలిపారు. బాలుడికి స్వ‌ల్పంగా గాయాలు కావ‌డంతో.. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలోని మ‌హేంద్ర‌ఘ‌ర్‌లో సెప్టెంబ‌ర్ 28న చోటు చేసుకోగా.. ఆ దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి.