ముంబై: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో నిందితుడు, బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ( Aryan Khan ) బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ కోసం ఇప్పటికే ఆర్యన్ ఖాన్, అతని స్నేహితుడు ఆర్బాజ్ ఖాన్, ఫ్యాషన్ మోడల్ మున్మున్ ధనేచా దాఖలు చేసిన పిటిషన్లను ఈ మధ్యాహ్నం ముంబైలోని స్పెషల్ కోర్టు తిరస్కరించింది. దాంతో కింది కోర్టు ఆర్డర్‌ను సవాల్ చేస్తూ ఆర్యన్ ఖాన్ లాయర్ వెంటనే బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు.
ఈ నెల 3న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో నిషేధిత మాదకద్రవ్యాలు సేవిస్తూ ఆర్యన్ ఖాన్‌తో సహా పలువురు పట్టుబడ్డారు. అనంతరం నిందితులు అందరినీ కోర్టులో హాజరుపర్చగా వారికి పోలీస్ కస్టడీ విధించింది. కేసులో పోలీసుల ఇంటరాగేషన్ కూడా పూర్తి కావడంతో ప్రస్తుతం నిందితులంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.