సోమవారం 25 జనవరి 2021
National - Dec 25, 2020 , 17:56:03

న‌గ‌ర మేయ‌ర్‌గా 21 ఏళ్ల యువ‌తి..

న‌గ‌ర మేయ‌ర్‌గా 21 ఏళ్ల యువ‌తి..

హైద‌రాబాద్‌: ఇర‌వై ఒక్క ఏళ్ల ఆర్యా రాజేంద్ర‌న్‌కు అదృష్టం క‌లిసి వ‌చ్చింది.  అతి పిన్న వ‌య‌సులోనే ఆమె కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం న‌గ‌రానికి మేయ‌ర్ కానున్నారు.  ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో ముద‌వ‌న్‌ముగ‌ల్ వార్డు నుంచి ఆర్యా రాజేంద్ర‌న్ కౌన్సిల‌ర్‌గా ఎన్నియ్యారు.  అయితే సీపీఎం జిల్లా నేత‌లు తిరువ‌నంత‌పురం బాధ్య‌త‌ల‌ను ఆర్యాకు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించారు. ఈ యేడు జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన అతిపిన్న వ‌య‌స్కురాలు కూడా ఆమె కావ‌డం విశేషం.   కేర‌ళ రాష్ట్ర రాజ‌ధాని తిరువ‌నంత‌పురం సీటును ఎల్‌డీఎఫ్ కైవ‌సం చేసుకున్న‌ది.  కానీ తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆ కూట‌మి త‌ర‌పున పోటీలో నిలిచిన ఇద్ద‌రు మేయ‌ర్ అభ్య‌ర్థులు ఓడిపోవ‌డం ఎల్‌డీఎఫ్‌కు తీర‌ని లోటుగా మారింది.  

తిరువ‌నంత‌పురంలోని ఆల్ సెయింట్స్ కాలేజీలో ఆర్యా రాజేంద్ర‌న్ బీఎస్సీ మ్యాథ‌మ‌టిక్స్ రెండ‌వ సంవ‌త్స‌రం చ‌దువుతున్న‌ది. రాజ‌కీయాల్లో ఆమె యాక్టివ్‌గా ఉంటున్న‌ది.  స్టూడెంట్స్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియాలో ఆమె రాష్ట్ర క‌మిటీ స‌భ్యురాలు కూడా. సీపీఎం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న బాల సంఘం రాష్ట్ర అధ్య‌క్షురాలిగా కూడా ఆర్యా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న‌ది.  న‌గ‌ర మేయ‌ర్ పోస్టును స్వీక‌రించేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఆర్యా తెలిపారు.  


logo