గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 10:49:14

పటాకులు కాల్చొద్దని ఆప్‌ శ్రేణులకు కేజ్రీవాల్‌ పిలుపు

పటాకులు కాల్చొద్దని ఆప్‌ శ్రేణులకు కేజ్రీవాల్‌ పిలుపు

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్‌ ఆధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్‌ 53 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఈ క్రమంలో ఆప్‌ శ్రేణులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి భారీగా తరలివస్తున్నారు. అయితే పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. ఆనందోత్సాహల మధ్య కార్యకర్తలు పటాకులు కాల్చొద్దని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. పటాకులు కాల్చడం వల్ల గాలి కాలుష్యం ఏర్పడుతుందని, దీని వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని కేజ్రీవాల్‌ సూచించారు. పటాకుల స్థానంలో స్వీట్లు, నామ్‌కీన్స్‌ పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 36. ప్రస్తుతం ఆప్‌ 53, బీజేపీ 17 స్థానాల్లో ముందంజలో ఉంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 67 స్థానాలను గెలుచుకుంది. 


logo