ఆదివారం 29 మార్చి 2020
National - Feb 13, 2020 , 03:39:51

16న కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం

16న కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం

దేశ రాజధాని ఢిల్లీలో హ్యాట్రిక్‌ విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నూతన సర్కార్‌ను ఏర్పాటు చేయడానికి అడుగులు వేస్తున్నది. ముచ్చటగా మూడోసారి చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో ఈ నెల 16 ఉదయం 10 గంటలకు సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణం చేయనున్నారు.

  • చారిత్రక రామ్‌లీలా మైదానంలో కార్యక్రమం
  • భారీ ఎత్తున ప్రజల తరలింపునకు ఏర్పాట్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశ రాజధాని ఢిల్లీలో హ్యాట్రిక్‌ విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నూతన సర్కార్‌ను ఏర్పాటు చేయడానికి అడుగులు వేస్తున్నది. ముచ్చటగా మూడోసారి చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో ఈ నెల 16 ఉదయం 10 గంటలకు సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణం చేయనున్నారు. ఇంతకుముందు కూడా ఇదే మైదానంలో ఆయన రెండుసార్లు సీఎంగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్‌తోపాటు క్యాబినెట్‌ మంత్రులంతా ప్రమాణం చేస్తారని ఆప్‌ సీనియర్‌ నేత, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా బుధవారం మీడియాకు తెలిపారు. క్యాబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్న మంత్రులను తిరిగి తీసుకోవాలని కేజ్రీవాల్‌ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే యువనేతలు ఆతిషి మర్లేనా, రాఘవ చద్దాలకు క్యాబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉంది. 


భవిష్యత్‌లో పార్టీలో వారు కీలక పాత్ర పోషిస్తారని ఆప్‌ వర్గాలు తెలిపాయి. రామ్‌లీలా మైదాన్‌లో సీఎంగా కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారాన్ని తిలకించేందుకు భారీగా ఢిల్లీ వాసులు తరలి రావాలని మనీశ్‌ సిసోడియా విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు 62 స్థానాలను ఆప్‌ కైవసంచేసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు బుధవారం కేజ్రీవాల్‌ తన నివాసంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలంతా కేజ్రీవాల్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇదిలా ఉంటే బుధవారం ఉదయం కేజ్రీవాల్‌ లెప్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై వారు చర్చించారని సమాచారం.





logo