శనివారం 28 మార్చి 2020
National - Feb 23, 2020 , 00:42:30

కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేదు

కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేదు
  • మెలానియా పాఠశాల సందర్శన జాబితాలో దక్కని చోటు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ ఈ నెల 25న ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. అయితే ఆమె పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు ఆమె వెంట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఉండరు. వాస్తవానికి మెలానియా పాఠశాలను సందర్శించడానికి వచ్చినప్పుడు ఆమె వెంట కేజ్రీవాల్‌, సిసోడియా ఉంటారని ఇంతకుముందు ఖరారైన షెడ్యూల్‌లో ఉన్న ది. దీంతో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘హ్యాపీనెస్‌ పాఠ్య ప్రణాళిక’ గురించి మెలానియాకు వివరించాలని వీరిద్దరు భావించారు. కానీ చివరికి షెడ్యూల్‌ నుంచి వీరిద్దరి పేర్లను తొలిగించారు. 


logo