బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 02:37:17

ఆప్‌ విజయమే అతిపెద్ద బర్త్‌డే గిఫ్ట్‌!

ఆప్‌ విజయమే అతిపెద్ద బర్త్‌డే గిఫ్ట్‌!
  • కేజ్రీవాల్‌ భార్య సునీత కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: తన పుట్టినరోజున ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఘన విజయం సాధించడం తనకు లభించిన అతిపెద్ద కానుక అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీత కేజ్రీవాల్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తున్నారో చూస్తూ అందరం బిజీగా ఉన్నాం. పుట్టినరోజు వేడుకలు పెద్దగా జరుపుకోలేదు. అయితే ఆప్‌ విజయమే నాకు అతిపెద్ద బహుమానం. ఇది సత్యానికి దక్కిన విజయం. సమస్యల ప్రాతిపదికన రాజకీయాలు నడవాలి. రాజకీయాల్లో ఎలాంటివి మాట్లాడకూడదో రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి. కేజ్రీవాల్‌ కష్టానికి లభించిన విజయం ఇది’ అని సునీత పేర్కొన్నారు. సునీత పుట్టినరోజు సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ తన కుమారుడు పులకిత్‌, కుమార్తె హర్షితతో కలిసి ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌చేశారు. ఆప్‌ విజయంపై హర్షిత స్పందిస్తూ.. ‘ఇది ప్రతి ఒక్కరి విజయం’ అని అన్నారు. 


logo