ఆదివారం 31 మే 2020
National - May 15, 2020 , 16:31:09

అరుణాచల్‌ప్రదేశ్‌లో సోమవారం నుంచి ప్రజా రవాణా

అరుణాచల్‌ప్రదేశ్‌లో సోమవారం నుంచి ప్రజా రవాణా

ఈటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌లో వచ్చే సోమవారం నుంచి ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోడ్డు రవాణా సంస్థ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారిని వారి స్వస్థలాలకు చేరవేయడానికి, సాధారణ ప్రజలు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లడానికి ప్రభుత్వం బస్సులను నడపాలని డిమాండ్‌ చేస్తున్నారని స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ జనరల్‌ మేనేజర్‌ అబు తయాంగ్‌ చెప్పారు. మే 18 నుంచి రాజధాని ఇటానగర్‌ నుంచి వివిధ ప్రాంతాలకు ఈ సర్వీసులు నడుస్తాయని ఆయన వెల్లడించారు.


logo