ఆదివారం 29 మార్చి 2020
National - Mar 08, 2020 , 13:43:44

అరుణాచల్‌ ప్రదేశ్‌లో విదేశీయులకు నో ఎంట్రీ

అరుణాచల్‌ ప్రదేశ్‌లో విదేశీయులకు నో ఎంట్రీ

ఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం తమ రాష్ట్రంలోకి విదేశీయుల రాకను నిలిపివేసింది. ఆ రాష్ట్రంలో పర్యటించాలనుకునే విదేశీలయులకు ఇచ్చే ప్రొటెక్టెడ్‌ ఏరియా పర్మిట్స్‌ (పీఏపీ)లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పీఏపీ ఇష్యూయింగ్‌ అథారిటీలకు ఆ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ నరేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నందున, విదేశాల నుంచి వస్తున్న వారి వల్లే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది.  కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 97 దేశాల్లో 1,02,180 మందికి కరోనా వ్యాపించగా, ఇప్పటికే 3500 మందికి పైగా ఈ వైరస్‌ వల్ల చనిపోయారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 


logo