ఆదివారం 29 మార్చి 2020
National - Mar 27, 2020 , 10:34:39

సతీష్‌ గుజ్రాల్‌ కన్నుమూత.. పీఎం మోదీ సంతాపం

సతీష్‌ గుజ్రాల్‌ కన్నుమూత.. పీఎం మోదీ సంతాపం

న్యూఢిల్లీ : పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ కళాకారుడు సతీష్‌ గుజ్రాల్‌(94) కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యం కారణంగా ఆయన ఢిల్లీలో గడిచిన రాత్రి మరణించారు. సతీష్‌ గుజ్రాల్‌ మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. దివంగత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ సోదరుడైన సతీష్‌ గుజ్రాల్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. రచన, వాస్తు శిల్పం, మురళీ వాయిద్యం, పెయింటింగ్‌, గ్రాఫిక్‌ ఆర్టిస్టుగా తన సృజనాత్మకతతో విశేష అభిమానం సంపాదించారు. ఆటోబయోగ్రఫీతో సహా నాలుగు పుస్తకాలను పబ్లిష్‌ చేశారు. సతీష్‌ గుజ్రాల్‌ వర్క్స్‌పై డజన్ల సంఖ్యలో డాక్యుమెంటరీలు రూపొందాయి అతని జీవితంపై ఫీచర్‌ ఫిలిం రూపొందుతున్నట్లు సతీష్‌కు చెందిన వెబ్‌సైట్‌లో పేర్కొనబడింది.


logo