గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 16:18:13

ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌ని ఆర్ట్‌.. త‌న‌ను తానే భ‌లే చిత్రించుకున్నాడు!

ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌ని ఆర్ట్‌.. త‌న‌ను తానే భ‌లే చిత్రించుకున్నాడు!

సీమ‌స్ వ్రే అనే క‌ళాకారుడు ఒక చిత్రాన్ని చిత్రించాడు. అది ఎవ‌రిదో కాదు. త‌న‌ను తానే చిత్రించుకున్నాడు. ఒక పొజిష‌న్‌లో కూర్చొని ఉన్న చిత్రాన్ని చిత్రించి ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. ఈ ఫోటోను చిత్రించి మ‌ర‌లా ఆ ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. ఈ ఫోటోకు మ‌రొక వైపు కూర్చొని మ‌రొక చిత్రం చిత్రించాడు. ఇలా నాలుగు విధాలుగా ఉన్న ఆర్ట్‌ను చిత్రించి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఒక్కొక్క పెయింటింగ్‌ను వివ‌రిస్తూ షేర్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఒక సెల్ఫ్ పోర్ట్రైట్ పెయింగ్‌లో ఉన్న‌ది నేనే. కాన్వాస్ మీద ఆయిల్ అనే క్యాప్ష‌న్‌తో షేర్ చేశాడు. ఇలాంటి ఆర్ట్‌ను ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌లేదు అంటూ నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఆర్ట్ 21కే లైక్స్ సంపాదించుకున్న‌ది. 

 

 

  


logo