శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 01:30:57

రామాలయంలో 2,100 కిలోల గంట!

రామాలయంలో 2,100 కిలోల గంట!

  • డిజైన్‌ రూపొందించిన ముస్లిం కళాకారుడు

జాలేసర్‌: అయోధ్య రామాలయం భిన్నత్వంలో ఏకత్వానికి మరో ప్రతీకగా నిలుస్తున్నది. అయోధ్య-బాబ్రీ వివాదంలో ప్రధాన కక్షిదారు అయిన ఇక్బాల్‌ అన్సారీ ఇటీవల భూమి పూజకు వెళ్లి భారత దేశ గొప్పదనాన్ని చాటారు. ఇప్పుడు ఇటువంటిదే మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. ఆలయ నిర్మాణం తర్వాత గుడిలో ఏర్పాటు చేయనున్న 2,100 కిలోల భారీ గంటకు ఇక్బాల్‌ మిస్త్రీ అనే ముస్లిం కళాకారుడు డిజైన్‌ను(నమూనా) రూపొందించారు. యూపీకి చెందిన దావు దయాళ్‌ అనే కళాకారుడు, ఆయన బృందం దీనిని తయారు చేస్తున్నది. 


logo