గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 13:18:09

స్వయం ప్రతిపత్తి రద్దుతో జమ్ముకశ్మీర్‌లో తగ్గిన అవినీతి

స్వయం ప్రతిపత్తి రద్దుతో జమ్ముకశ్మీర్‌లో తగ్గిన అవినీతి

కశ్మీర్‌ : జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతో అవినీతి చాలా తగ్గిందని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి జీ. కిషన్‌రెడ్డి అన్నారు. ఓ జమ్ముకశ్మీర్‌ నేత చైనా సహకారంతో మళ్లీ ఆర్టికల్‌ 370ని తీసుకొస్తామని మాట్లాడుతున్నాడని, మరొకరు తాము మువ్వన్నెల జెండా పట్టుకోబోమని అంటున్నారు. అధికారం లేకపోవడంతో నియంత్రణ కోల్పోయి మాట్లాడుతున్నారు.

ఏండ్లుగా అధికారంలో ఉండి అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను అప్పనంగా దోచేశారని పీడీపీ తదితర పార్టీలనుద్దేశించి ఆయన అన్నారు. కొన్నేళ్లుగా ఐటీబీపీ అత్యాధునిక ఆయుధాలు, అధునాతన సామగ్రి కొనుగోలు చేస్తున్నదని పేర్కొన్నారు. సరిహద్దు పహార, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించేందుకు వీలుగా ఇటీవల 28 అధునాతన వాహనాలను ఐటీబీపీ కొనుగోలు చేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.