ఆదివారం 31 మే 2020
National - May 16, 2020 , 02:23:26

విద్యార్థులకు ఆర్ట్స్‌ ప్రాజెక్టులు

విద్యార్థులకు ఆర్ట్స్‌  ప్రాజెక్టులు

ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

వాటికీ మార్కులుంటాయి: సీబీఎస్‌ఈ

న్యూఢిల్లీ, మే 15: ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులు ఆర్ట్స్‌ ప్రాజెక్టులు రూపొందించేలా చూడాలని పాఠశాలలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెంకడరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కోరింది. 1 నుంచి 10వ తరగతి వరకు ఈ విధానం అమలు చేయాలని సూచించింది. 9, 10 తరగతుల విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం ఒకటైనా ఆర్ట్స్‌ ప్రాజెక్టు రూపొందించాలన్నది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులు కనీసం ఒకటైనా ఇలాంటి ప్రాజెక్టు చేపట్టేలా చూడాలని పాఠశాలలను కోరింది. 1 నుంచి 8వ తరగతి విద్యార్ధులు చేపట్టే ప్రాజెక్టులు వివిధ విభాగాలతో కూడినవై ఉండాలని, 10వ తరగతి వరకు విద్యార్థులు చేపట్టే ప్రాజెక్టుల్లో ఒకటైనా అనుబంధ (లింక్‌) రాష్ర్టాలకు సంబంధించినదై ఉండాలని సూచించింది. ఉదాహరణకు ఢిల్లీ విద్యార్థులు సిక్కింకు చెందిన అంశంపై ఆర్ట్‌ ప్రాజెక్టు చేపట్టాలని తెలిపింది. రాష్ర్టాలకు ఇతర ఏ రాష్ర్టాలు లింక్‌గా ఉన్నాయన్న వివరాలు సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నది. ఈ ప్రాజెక్టులకు (అంతర్గత అంచనాలో భాగంగా) మార్కులు ఉంటాయని తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా స్థానికంగా ఉన్న వనరులను ఉపయోగించుకొని ఈ ప్రాజెక్టులు రూపొందించేలా చూడాలని పేర్కొంది.


logo