బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ అన్నిప్రాంతీయ భాషలలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే సీజన్ ప్రారంభానికి ముందు ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్కి సంబంధించి అనేక ప్రచారాలు నడుస్తున్న నేపథ్యంలో కొందరు సెలబ్స్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య పాయల్ రాజ్పుత్ తెలుగు బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లనుందంటూ ప్రచారం జరగగా,దానిని పాయల్ ఖండించింది.
ఇక సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి, నటి అంకిత లోఖండే కూడా హిందీ బిగ్ బాస్ లోకి వెళ్లనుందంటూ కొంత కాలంగా ప్రచారం నడుస్తుంది. ఈ వార్తలు అంకిత వరకు చేరడంతో ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. నేను ఈ ఏడాది బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అవన్నీ అవాస్తవాలు. నేను బిగ్ బాస్ షోలో భాగం కాకపోయిన కూడా ప్రజలు ద్వేషిస్తున్నారు అని చెప్పుకొచ్చింది అంకిత.