శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 12, 2020 , 14:36:12

మలేషియా నుంచి 220 మంది ఇండియాకు రాక

మలేషియా నుంచి 220 మంది ఇండియాకు రాక

అమృత్‌సర్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందేభారత్‌ మిషన్‌ పథకం కింద విదేశీ భారతీయులు 220 మంది శనివారం మలేషియా నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్నారు. ఇప్పటివరకు వందే భారత్‌ పథకం ద్వారా సుమారు 5,80,000 మంది జులై 8 వరకు వివిధ దేశాల నుంచి భారత్‌కు తిరిగి వచ్చారని రాయభార వ్యవహారాల శాఖ మంత్రి గురువారం తెలియజేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారత్‌ సంతతిని తిరిగి స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి దశ మిషన్‌ మే 7న ప్రారంభమైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo