మంగళవారం 26 జనవరి 2021
National - Dec 05, 2020 , 16:57:51

#అరెస్ట్‌యోగ్‌రాజ్‌సింగ్‌..హ్యాష్‌ట్యాగ్‌ వైరల్‌..

#అరెస్ట్‌యోగ్‌రాజ్‌సింగ్‌..హ్యాష్‌ట్యాగ్‌ వైరల్‌..

న్యూ ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌సింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఎప్పుడూ మహేంద్రసింగ్‌ ధోనీపై విషంగక్కే యోగ్‌రాజ్‌సింగ్‌ ఈ సారి హిందువులు, ప్రధాని, ఇతర నాయకులపై నోరుపారేసుకున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ధర్నాలో అతడు విద్వేషపూరిత ప్రసంగం చేశాడు.

యోగ్‌రాజ్‌సింగ్‌ విద్వేషపూరిత ప్రసంగం క్లిప్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. #అరెస్ట్‌యోగ్‌రాజ్‌సింగ్‌ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌ మార్మోగుతున్నది. హిందువులను, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా, గుజరాతీలపై అభ్యంతకర వ్యాఖ్యలుచేసిన యోగ్‌రాజ్‌సింగ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని అంతా డిమాండ్‌ చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని హర్యానా, పంజాబ్‌ రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. కేంద్ర సర్కారుతో చర్చలు విఫలం కావడంతో ఈ నెల 8న భారత్‌ బంద్‌కుకూడా పిలుపునిచ్చారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo