ఆదివారం 24 మే 2020
National - Feb 19, 2020 , 22:43:02

ఉగ్రవాదులకు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్‌..

ఉగ్రవాదులకు సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్‌..

జమ్మూ కశ్మీర్‌: ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఓ వ్యక్తిని కుల్గాం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సదరు వ్యక్తి లష్కర్‌-ఇ-తైబా సంస్థకు చెందిన ఉగ్రవాదులకు పరోక్షంగా సహకరిస్తూ, వారికి రవాణా సదుపాయం, వసతి కల్పిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడిని వెంటాడి పట్టుకున్న పోలీసులు.. అతడి నుంచి 12 రౌండ్ల ఏకే బుల్లెట్స్‌, 3 మొబైల్‌ సెట్స్‌తో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కిమోహ్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.


logo