సోమవారం 06 జూలై 2020
National - Jun 03, 2020 , 12:33:19

నిసర్గ ఎఫెక్ట్‌.. పునరావాస కేంద్రాలకు 90 వేల మంది తరలింపు

నిసర్గ ఎఫెక్ట్‌.. పునరావాస కేంద్రాలకు 90 వేల మంది తరలింపు

ముంబై : మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతాలపై నిసర్గ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్‌ఎఫ్‌) తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో 40 వేల మందిని, గుజరాత్‌లో 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంబై పరిసర ప్రాంతాల్లో 20 ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను మోహరించారు. గుజరాత్‌లో 15 ఎన్డీఆర్‌ఎఫ్‌, 6 ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలను మోహరించారు. దక్షిణ గుజరాత్‌లోని పరిశ్రమలను ముందస్తు జాగ్రత్తగా మూసివేశారు. 

మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ జిల్లా వ్యాప్తంగా 13,541 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆ జిల్లా కలెక్టర్‌ నిధి చౌదరి వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నిసర్గ తుపాను తీరం దాటే అవకాశం ఉంది.


logo