బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 16:26:11

60 మంది వలస కూలీలు అరెస్టు

60 మంది వలస కూలీలు అరెస్టు

గుజరాత్‌ : గుజరాత్‌లోని సూరత్‌లో 60 మంది వలస కూలీలను పోలీసులు అరెస్టు చేశారు. తమను స్వస్థలాలకు పంపాలని డిమాండ్‌ చేస్తూ సూరత్‌లో వలస కూలీలు నేడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమను సొంత రాష్ర్టాలకు పంపాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ ఈ ఉదయం 500 నుంచి 1000 మంది కూలీలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు 60 మంది కూలీలను అరెస్ట్‌ చేశారు. మరో 50 నుంచి 60 మందిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు సూరత్‌ జాయింట్‌ కమిషనర్‌ డి.ఎన్‌.పటేల్‌ తెలిపారు. నిన్న సైతం ఇదే విధంగా వలస కూలీలు రోడ్లపైకి వచ్చారన్నారు. జాబితా తయారీ అనంతరం రైళ్లలో పంపనున్నటుల చెప్పగా వెనుతిరిగారన్నారు. వలస కూలీలను తరలించేందుకు 5 నుంచి 7 రైళ్లు అవసరమౌతాయని అధికారులకు తెలిపినట్లుగా ఆయన పేర్కొన్నారు.


logo