శుక్రవారం 05 మార్చి 2021
National - Jan 17, 2021 , 10:27:23

పొగమంచు ఎఫెక్ట్‌.. 26 రైళ్లు ఆలస్యం..

పొగమంచు ఎఫెక్ట్‌.. 26 రైళ్లు ఆలస్యం..

న్యూఢిల్లీ : దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి నడిచే సుమారు 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భారీగా పొగమంచు ఉండడమే కారణమని అధికార వర్గాలు తెలిపారు. ఉత్తర రైల్వేలోని ప్రయాగ్‌రాజ్‌ సంగం - చండీగఢ్‌ స్పెషల్‌ ట్రైన్‌ (04217), గయా - న్యూఢిల్లీ స్పెషల్‌ (02397) గరిష్ఠంగా 3.45 గంటలు ఆలస్యంగా నడస్తున్నాయని అధికారులు తెలిపారు. అలాగే రాజ్‌గిర్‌ టూ న్యూఢిల్లీ (02391) శ్రమజీవి ఎక్స్ ప్రెస్, హౌరా జేఎన్‌ రైల్వేస్టేషన్‌ - న్యూఢిల్లీ స్పెషల్‌ (02303), ఆజమ్‌గఢ్‌- ఢిల్లీ కైఫీయాత్‌ స్పెషల్‌ (02225), పాట్నా- ఢిల్లీ (02393) సంపూర్ణ క్రాంతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మూడు గంటలకుపైగా ఆలస్యమయ్యాయని అధికారులు తెలిపారు. అలాగే వీటితో పాటు మరికొన్ని ట్రైన్లు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి. పంజాబ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, అసోం, మేఘాలయలో భారీగా పొగమంచు ఉందని భారతవాతావరణశాఖ తెలిపింది.

VIDEOS

logo