బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 10:04:32

ర్యాగింగ్‌ చేశారని బాయ్స్‌ హాస్టల్‌ ధ్వంసం.. వీడియో

ర్యాగింగ్‌ చేశారని బాయ్స్‌ హాస్టల్‌ ధ్వంసం.. వీడియో

బెంగళూరు : ఓ అమ్మాయిని ర్యాగింగ్‌ చేశారని.. ఆమె సన్నిహితులు బాయ్స్‌ హాస్టల్‌లోకి ప్రవేశించి నానా హంగామా చేశారు. హాస్టల్‌ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెల్గాంలో ఫిబ్రవరి 23న చోటు చేసుకుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పోస్టు మెట్రిక్‌ హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు విద్యార్థులు కలిసి.. ఓ అమ్మాయిని ర్యాగింగ్‌ చేశారు. బాధిత అమ్మాయి తనకు జరిగిన అవమానాన్ని సన్నిహితుల వద్ద పంచుకుంది. దీంతో సుమారు 20 మంది అబ్బాయిలు ఇనుపరాడ్లు, కర్రలు, బ్యాట్‌లతో హాస్టల్‌లోకి ప్రవేశించారు. హాస్టల్‌ ఫర్నిచర్‌తో పాటు అక్కడున్న బైక్‌లు, స్కూటర్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై హాస్టల్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. 


logo