శుక్రవారం 03 జూలై 2020
National - Jun 05, 2020 , 12:02:07

ఢిల్లీ మెట్రోలో 20 మంది ఉద్యోగులకు కరోనా

ఢిల్లీ మెట్రోలో 20 మంది ఉద్యోగులకు కరోనా

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ)కి చెందిన ఇరవై మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ అని తేలిసింది. వారంతా కోలుకుంటున్నారని డీఎంఆర్‌సీ అధికారులు ప్రకటించారు. దేశంతోపాటు డీఎంఆర్‌సీ కూడా కరోనాపై యుద్ధం చేస్తున్నదని తెలిపింది. ప్రయాణికులకు సేవలు అందించడానికి సిద్ధమవుతున్నామని పేర్కొంది. దేశ రాజధాని ప్రాంతంలో ఉంటున్న సుమారు 20 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. వారంతా వేగంగా కోలుకుంటున్నారని వెల్లడించింది. ఉద్యోగులు తప్పనిసరిగా భౌతికదూరం నిబంధనలను పాటించాలని డీఎంఆర్‌సీ ఎండీ మంగూ సింగ్‌ సూచించారు. త్వరలోనే మెట్రో సర్వీసులను ప్రారంభిస్తామని వెల్లడించారు.   

దేశరాజధానిలో ప్రధాన ప్రజారవాణ సాధనాల్లో ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఒకటి. రోజూ వేల సంఖ్యలో ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నది.


logo