స్టార్ హీరో సినిమా విడుదల అయిందంటే చాలు ఆ మూవీ చుట్టూ అనేక వివాదాలు చుట్టు ముడుతుంటాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం ఈద్ కానుకగా ఓటీటీలో విడుదలైంది. థియేటర్‌తో పాటు ఓటీటీలో ఒకేసారి విడుదల చేయాలని ముందు భావించినప్పటికీ, పరిస్థితుల ప్రభావం వలన థియేటర్లో విడుదల చేయడం కుదరలేదు. ప్రస్తుతం జీ5 యాప్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ చిత్రానికి నిరసన సెగలు తగిలాయి.
సల్మాన్ ఖాన్, దిశా పటాని ప్రధాన పాత్రలలో ప్రభుదేవా తెరకెక్కించిన చిత్రం రాధే. ముంబై క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం భారీ రెస్పాన్స్ ను కొల్లగొట్టి భాయ్ క్రేజ్ ను మరోసారి చూపించింది. అయితే సోషల్ మీడియాలో సల్మాన్ రాధే చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. “బాయ్ కాట్ రాధే” అనే ట్యాగ్‌తో జాతీయ స్థాయిలో ట్రెండ్ చేస్తుండగా, ఇందుకు గల పూర్తి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.