బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 04, 2020 , 09:48:32

అర్న‌బ్ గోస్వామి అరెస్టు.. ఖండించిన కేంద్ర మంత్రి

అర్న‌బ్ గోస్వామి అరెస్టు.. ఖండించిన కేంద్ర మంత్రి

హైద‌రాబాద్‌:  రిప‌బ్లిక్ టీవీ సీఈవో అర్న‌బ్ గోస్వామిని ఇవాళ ముంబై పోలీసులు అరెస్టు చేశారు.  53 ఏళ్ల ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు.  అర్న‌బ్‌ను త‌న ఇంటి నుంచి అలీబాగ్ పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు ఓ పోలీసు అధికారి వెల్ల‌డించారు.  ఇంట్లో త‌న‌పై పోలీసులు దాడి చేసిన‌ట్లు జ‌ర్న‌లిస్ట్ అర్న‌బ్ ఆరోపించారు.  పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువెళ్తున్న క్ర‌మంలో అర్న‌బ్‌ను పోలీసు వ్యాన్‌లోకి తోసివేశారు.  2018లో  రిప‌బ్లిక్ టీవీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో.. ఓ డిజైన‌ర్‌తో పాటు ఆయ‌న త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. అయితే ఆ ఆర్కిటెక్ట్ కూతురు అద్యా నాయ‌క్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఆ కేసులో విచార‌ణ మొద‌లుపెట్టిన‌ట్లు ఈ ఏడాది మేలో మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. అలీబాగ్ పోలీసులు ఆ కేసులో విచార‌ణ స‌రిగా చేపట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల త‌న తండ్రి మ‌ర‌ణించిన‌ట్లు అద్యా త‌న ఫిర్యాదులో ఆరోపించింది.  కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌.. అర్న‌బ్ అరెస్టుపై రియాక్ట్ అయ్యారు. మ‌హారాష్ట్ర‌లో ప‌త్రికా స్వేచ్ఛ‌పై దాడి జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ప‌త్రికా రంగాన్ని చూడాల్సిన విధానం ఇది కాద‌న్నారు. ఎమ‌ర్జెన్సీ కాలంలో ప్రెస్‌ను ఇలాగే చూశార‌ని ఆయ‌న త‌న ట్వీట్‌లో ఆరోపించారు.