శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 17:29:32

ఆర్న‌బ్ గోస్వామికి తాత్కాలిక బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

ఆర్న‌బ్ గోస్వామికి తాత్కాలిక బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: అర్కిటెక్ట్ అన్వ‌య్ నాయ‌క్‌ను ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించిన ఆరోప‌ణ‌ల‌పై అరెస్ట‌యిన‌ రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్ ఆర్న‌బ్ గోస్వామికి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆర్న‌బ్ బెయిల్ పిటిష‌న్‌పై జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, ఇందిరా బెన‌ర్జి ఆధ్వ‌ర్యంలోని ద్విస‌భ్య ధ‌ర్మాసనం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ జ‌రిపింది. ఆర్న‌బ్‌తోపాటు అత‌ని ఇద్ద‌రు స‌హ నిందితుల‌కు కూడా సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. వ్య‌క్తిగ‌త పూచీక‌త్తు కింద నిందితులు ముగ్గురూ రూ.50 వేల చొప్పున బాండ్ స‌మ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశించింది. 

నిందితుల విడుద‌ల‌లో ఎక్కువ‌ ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. ఈ విష‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోర్టు మంద‌లించింది. 2018లో ఆర్కిటెక్ట్ అన్వ‌య్ నాయ‌క్, అత‌ని త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ప‌రోక్షంగా ఆర్న‌బ్ గోస్వామియే ఈ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే, ఆ త‌ర్వాత కేసు క్లోజ్ కాగా మ‌హారాష్ట్ర స‌ర్కారు ఇటీవ‌ల రీ ఓపెన్ చేయించింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.