సోమవారం 01 మార్చి 2021
National - Jan 20, 2021 , 14:51:32

ఆర్మీ యూనిఫాంలో రైతు నిరసనల్లో పాల్గొనవద్దు..

ఆర్మీ యూనిఫాంలో రైతు నిరసనల్లో పాల్గొనవద్దు..

న్యూఢిల్లీ: ఆర్మీ యూనిఫాం, మెడల్స్ ధరించి రైతు నిరసనల్లో పాల్గొనవద్దని మాజీ ఉద్యోగులను ఆర్మీ కోరింది. సైనిక దుస్తులు ధరించడానికి సంబంధించిన విధివిధానాలు, నిబంధలను గుర్తు చేస్తూ కేంద్రీయ సైనిక బోర్డుకు ఆర్మీ లేఖ రాసింది. సాధారణంగా అధికార కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాల్లో మాత్రమే మాజీ ఉద్యోగులు ఆర్మీ యూనిఫాం ధరించాలి. బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాల్లో వాటిని ధరించకూడదు. 

అయితే పంజాబ్‌కు చెందిన కొందరు మాజీ ఉద్యోగులు రైతు నిరసనల్లో పాల్గొన్న సందర్భాల్లో ఆర్మీ దుస్తులు ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ దీనిపై మరోసారి స్పష్టత ఇచ్చింది. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే మాజీ ఉద్యోగులు ఆర్మీ యూనిఫాంను ధరించకూడదని పేర్కొంది. అలాగే సైనిక విధుల్లో ఉన్న వారు రైతు నిరసనలకు దూరంగా ఉండాలని వెల్లడించింది. ఈ నెల 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా భారీ ట్రాక్టర్‌ ర్యాలీకి రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సూచన జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo