గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 02:57:55

ఆర్మీలో మహిళలూ పర్మనెంట్‌

ఆర్మీలో మహిళలూ పర్మనెంట్‌

  • పీసీ కోసం దరఖాస్తుల ఆహ్వానం

న్యూఢిల్లీ: సైన్యంలో మహిళా ఉద్యోగుల కోసం ఏర్పాటుచేస్తున్న శాశ్వత కమిషన్‌ (పీసీ)కు దరఖాస్తులను  ఆహ్వానించారు. ఉమెన్‌ స్పెషల్‌ ఎంట్రీ స్కీం (డబ్ల్యూఎస్‌ఈఎస్‌), షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా నియమితులపై మహిళా అధికారులు పర్మనెంట్‌ కమిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీలోని సైనిక ప్రధాన కార్యాలయం మంగళవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ నెల 31వరకు తుది గడువుగా నిర్ణయించింది. సైన్యంలో మహిళా ఉద్యోగులు, అధికారుల కోసం పర్మనెంట్‌ కమిషన్‌ను ఏర్పాటుచేయనున్నట్టు గత నెలలో రక్షణశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. పీసీ ద్వారా పురుష ఉద్యోగులతోపాటు మహిళలూ రిటైర్మెంట్‌ వయసు వచ్చేవరకు సర్వీసులో కొనసాగే అవకాశం లభిస్తుంది.


logo