ఆదివారం 29 మార్చి 2020
National - Feb 26, 2020 , 11:31:32

ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు : సీఎం కేజ్రీవాల్‌

ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు : సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉన్నాయని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలు, ఘర్షణలను నియంత్రించేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. అదనపు బలగాలు మోహరించినా కొన్ని చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్నారు కేజ్రీవాల్‌. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని రంగంలోకి దించాలన్న కేజ్రీవాల్‌.. ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే కర్ఫ్యూ విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాస్తున్నానని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియాకు తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై మంత్రివర్గంలో చర్చిస్తున్నట్లు సమాచారం.


logo