శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 18, 2020 , 17:01:21

అమర్‌నాథ్ యాత్రపై దాడికి ఉగ్రవాదుల కుట్ర

అమర్‌నాథ్ యాత్రపై దాడికి ఉగ్రవాదుల కుట్ర

శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్రపై దాడి చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు పన్నిన కుట్రకు సంబంధించిన సమాచారం జమ్ముకశ్మీర్‌లోని భద్రతా దళాలకు అందిందని ఆర్మీ అధికారి చెప్పారు. వార్షిక తీర్థయాత్రకు అడ్డుపడకుండా ఉండేందుకు అన్ని వ్యవస్థలు, వనరులు సిద్ధంగా ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు.

జూలై 21 న యాత్ర ప్రారంభం కావడానికి నాలుగు రోజుల ముందు జరిగిన ఎన్ కౌంటర్లో జైష్-ఏ-మొహమ్మద్ కమాండర్ తోపాటు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయినవారు అమర్ నాథ్ యాత్రికులపై దాడి చేసేందుకు బయల్దేరినట్లు సమాచారం.

"యాత్రను లక్ష్యంగా చేసుకోవడానికి ఉగ్రవాదులు తమ వంతు ప్రయత్నం చేస్తారని ఇన్‌పుట్‌లు ఉన్నాయి. కాని వారు యాత్రను అడ్డుపడకుండా, శాంతియుతంగా సాగేలా చూడడానికి మా వ్యవస్థలు, వనరులను సిద్ధంగా ఉంచాం" అని కమాండర్ బ్రిగేడియర్ వివేక్ సింగ్ ఠాకూర్ తెలిపారు. "అమర్‌నాథ్ యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరుగుతుందని, భద్రతా పరిస్థితులు అదుపులో ఉంటాయని భావిస్తున్నాం" అని ఆయన చెప్పారు.

యాత్రికులు ఉపయోగించే 44 నంబర్ జాతీయ రహదారి విస్తీర్ణం సున్నితంగా కొనసాగుతున్నదని బ్రిగేడియర్ ఠాకూర్ అన్నారు. "ఈ మార్గం కొంచెం సున్నితమైనది. సోనామార్గ్ (గాండెర్బల్) వరకు వెళ్ళడానికి యాత్రికులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అమర్‌నాథ్ గుహ వరకు వెళ్ళడానికి చురుకుగా ఉండే ఏకైక మార్గం ఇది" అని ఆయన వెల్లడించారు. 

యాత్రికుల భద్రత నిమిత్తం హైవే, భగవతి నగర్ బేస్ క్యాంప్‌లో సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. లఖన్‌పూర్, దిగువ ముండా శ్రీనగర్‌లో శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రయాణికులకు స్క్రీనింగ్ ఉంటుంది. జూలై 21 నుంచి ప్రతిపాదిత ప్రయాణానికి సంబంధించిన భద్రతా పనులు పూర్తయ్యాయి. ప్రతిరోజూ 500 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు.


logo