గురువారం 04 జూన్ 2020
National - May 14, 2020 , 02:32:02

ఆర్మీలో ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’

ఆర్మీలో ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’

న్యూఢిల్లీ: దేశానికి సేవ చేసే అవకాశాన్ని యువతకు కల్పించాలని ఆర్మీ యోచిస్తున్నది. మూడేండ్ల పాటు మిలిటరీలో విధులు నిర్వహించే  ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ (టీఓడీ)’ ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నది. ప్రయోగాత్మకంగా ఆఫీసర్‌ క్యాడర్‌ కింద వంద మందిని, జవాన్‌ క్యాడర్‌ కింద వెయ్యి మందిని నియమించి, అనంతరం ఈ సంఖ్యను పెంచనున్నారు. జీతాలు, పెన్షన్ల వ్యయాలు భారీగా పెరుగుతుండటం ఆర్మీ ఆధునీకరణపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. మరోవైపు జవాన్ల పదవీ విరమణ వయసును పెంచాలని భావిస్తున్నట్లు సైనిక దళాల అధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. మరోవైపు ప్రధాని మోదీ పిలుపు మేరకు సైన్యం స్వదేశీ మంత్రాన్ని పాటించనున్నది. జూన్‌ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పారామిలిటరీ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే విక్రయించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బుధవారం ప్రకటించారు. ‘జూన్‌ 1 నుంచి కేంద్ర సాయుధ పోలీసు దళాలు (పీఏపీఎఫ్‌), సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ వంటి అన్ని క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తారు. 


logo