బుధవారం 03 మార్చి 2021
National - Jan 24, 2021 , 19:40:03

భారీ మంచులో మహిళను ఆరు కిలోమీటర్లు మోసిన జవాన్లు

భారీ మంచులో మహిళను ఆరు కిలోమీటర్లు మోసిన జవాన్లు

జమ్ము: భారత జవాన్లు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రసవించిన మహిళను ఆరు కిలోమీటర్లు మోసి ఆమె ఇంటికి చేర్చారు. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో భారీగా మంచుకురుస్తున్నది. కాగా ఓ నిండు గర్భిణీ ఆసుపత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. అయితే మంచు భారీగా కురుస్తుండటంతో ఇంటికి వెళ్లలేక పసిబడ్డతో సహా ఆసుపత్రిలో చిక్కుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్మీ జవాన్లు శనివారం స్ట్రెచర్‌పై మహిళతోపాటు బిడ్డను సురక్షితంగా ఉంచి ఆరు కిలోమీటర్ల దూరం నడిచి కుప్వారాలోని ఆమె ఇంటికి చేర్చారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. భారీ హిమపాతాన్ని లెక్కచేయక ప్రసవించిన మహిళకు ఆర్మీ సిబ్బంది చేసిన సహాయాన్ని నెటిజన్లు కొనియాడారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి

VIDEOS

logo