బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 15:26:12

ఫేస్‌బుక్ బ్యాన్‌.. కోర్టుకెళ్లిన ఆర్మీ ఆఫీస‌ర్‌

ఫేస్‌బుక్ బ్యాన్‌.. కోర్టుకెళ్లిన ఆర్మీ ఆఫీస‌ర్‌

హైద‌రాబాద్‌: ర‌క్ష‌ణ ద‌ళాల్లో ప‌నిచేస్తున్న వారు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు దూరంగా ఉండాల‌ని ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే ఫేస్‌బుక్ లాంటి వాటిని సైనికులు వాడ‌రాదు అని విధించిన నిషేధాన్ని స‌వాల్ చేస్తూ ఓ ఆర్మీ ఆఫీస‌ర్ కోర్టుకు వెళ్లారు.  లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ పీకే చౌద‌రీ.. సోష‌ల్ సైట్ల నిషేధాన్ని స‌వాల్ చేస్తూ ఢిల్లీహైకోర్టులో పిటిష‌న్ వేశారు.  రేపు ఆ పిటిష‌న్‌పై కోర్టు వాద‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ది. 89 అప్లికేష‌న్లుతో పాటు కొన్ని వెబ్‌సైట్ల‌ను వాడ‌రాదు అని ప్ర‌భుత్వం ఓ విధానాన్ని ప్ర‌క‌టించింది.  కానీ సోష‌ల్ సైట్ల‌పై నిషేధం విధించ‌డం భావ‌స్వేచ్ఛ‌కు, ప్రైవ‌సీ హ‌క్కును ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని క‌ల్న‌ల్ చౌద‌రీ త‌న పిటిష‌న్‌లో తెలిపారు.  

సుదూర ప్రాంతాల్లో ఉన్న తాము కుటుంబ‌స‌భ్యుల‌తో గ‌డిపేందుకు ఫేస్‌బుక్ లాంటి సోష‌ల్ సైట్లు ఉప‌క‌రిస్తాయ‌ని ఆ క‌ల్న‌ల్ త‌న పిటిష‌న్‌లో తెలిపారు. ఎఫ్‌బీ, ఇన్‌స్టాలు త‌మ ఫ్యామిలీల‌తో క‌నెక్ట్ అయ్యేలా చేస్తాయ‌న్నారు. జూన్ ఆర‌వ తేదీన జారీ చేసిన ఆదేశాల‌ను డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మిలిట‌రీ ఇంటెలిజెన్స్ వెన‌క్కి తీసుకోవాల‌ని క‌ల్న‌ల్ కోరారు.
logo