శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Feb 23, 2021 , 14:55:41

ప్ర‌మాద‌వ‌శాత్తు తుపాకీ పేలి ఆర్మీ జ‌వాన్ మృతి

ప్ర‌మాద‌వ‌శాత్తు తుపాకీ పేలి ఆర్మీ జ‌వాన్ మృతి

జ‌మ్ము: ప‌్ర‌మాద‌వ‌శాత్తు తుపాకీ పేల‌డంతో ఫైరింగ్ శిక్ష‌ణ‌లో ఉన్న ఓ జ‌వాన్ మృతిచెందాడు. జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం అంకూర్ సెక్టార్‌లోని ఫైరింగ్ రేంజ్‌లో ఫైరింగ్‌కు సంబంధించిన‌ శిక్ష‌ణ తీసుకుంటుండ‌గా ఆర్టిల‌రీ రెజిమెంట్‌కు చెందిన జ‌వాన్‌‌ గున్నెర్ సాయ‌న్ ఘోష్ చేతిలోని తుపాకీ పొజిష‌న్ తీసుకోక‌ముందే ప్ర‌మాద‌వ‌శాత్తు పేలింది. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ ఘోష్ కాసేప‌టికే మృతిచెందాడు. ఇవాళ‌ ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo