దివంగత జయలలిత మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల అభిమానాన్ని కూడగట్టుకుంటున్నది. ఆన్లైన్లో తెగ వైరల్ అవుతున్న ఈ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా కంగనా రనౌత్ ధరించిన ఆభరణాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కంగనా లుక్ గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా ఉందని ప్రశంసిస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకూ, ‘తలైవి సొమ్ములు మనవెట్లా అవుతాయి?’ అనేకదా మీ సందేహం. కంగనా ముస్తాబు చేసుకున్న నగలన్నీ హైదరాబాద్లోని కిషన్దాస్ అండ్ కో జువెలర్స్ సమకూర్చినవే. అమీ పటేల్ డిజైన్ చేశారు. ‘తలైవి పాత్ర ఎంత నచ్చిందో, ఈ నగలూ అంతే నచ్చాయి. థ్యాంక్ యూ హైదరాబాద్’ అంటూ ఆత్మీయుల సమక్షంలో ఆనందం వ్యక్తం చేశారట కంగనా రనౌత్.