మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 14:38:58

లడాఖ్‌లో టెన్ష‌న్‌.. లేహ్‌లో ఆర్మీ చీఫ్ విజిట్‌

లడాఖ్‌లో టెన్ష‌న్‌.. లేహ్‌లో ఆర్మీ చీఫ్ విజిట్‌


హైద‌రాబాద్‌:  లడాఖ్‌లోని నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద చైనాతో ఉద్రిక్త‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వాణే.. లేహ్‌లో ప‌ర్య‌టించారు. అక్క‌డి ప‌రిస్థితుల‌ను ఆయ‌న స్వ‌యంగా స‌మీక్షించారు. ఫీల్డ్ క‌మాండ‌ర్ల‌తో ప‌రిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నార్త్ ఆర్మీ క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ వైకే జోషి, 14 కార్ప‌ర్స్ చీఫ్ లెప్టినెంట్ జ‌న‌ర‌ల్ హ‌రింద‌ర్ సింగ్‌లు.. ఆర్మీ చీఫ్‌కు అక్క‌డ ప‌రిస్థితుల‌ను వివ‌రించారు.  గ‌త నెల‌లో ల‌డాఖ్‌లోని పాన్‌గంగ్ లేక్‌తో పాటు సిక్కింలోని నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద కూడా చైనా సైనికుల‌తో మ‌న జ‌వాన్ల బాహీబాహీకి దిగారు.    


logo